- ముధోల్ ఎస్బిఐ బ్యాంకులో దుండగుల చోరీ
- ఇనుప చివ్వలు కత్తిరించి బ్యాంకులో ప్రవేశం
- సిసి కెమెరా, అలారం తీగలు కత్తిరించబడ్డాయి
- పోలీసుల విచారణలో క్లూస్ టీం, డాగ్ స్క్వయిడ్ సహకారం
: ముధోల్ మండలంలో గల ఎస్బిఐ బ్యాంకులో దుండగులు ఇనుప చివ్వలు కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు సిబ్బంది ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం, డాగ్ స్క్వయిడ్ సహాయంతో పరిసరాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముధోల్ ఎస్ఐ సాయికిరణ్ తెలిపారు.
: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో పాత బస్టాండ్లో గల ఎస్బిఐ బ్యాంకులో సెప్టెంబర్ 14న చోరీ జరిగింది. దుండగులు బ్యాంకు వెనుక భాగం నుండి ఇనుప చివ్వలు కత్తిరించి లోపలికి ప్రవేశించారు. చోరీకి ముందుగా బ్యాంకు లోపల గల సిసి కెమెరా, అలారం తీగలను కత్తిరించి, ఆధారాలను తొలగించారు.
ఉదయం బ్యాంకు సిబ్బంది బ్యాంకును తెరవడానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గమనించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో, పోలీసులు క్లూస్ టీం మరియు డాగ్ స్క్వయిడ్ సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ముధోల్ ఎస్ఐ సాయికిరణ్ మాట్లాడుతూ, అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.