సాగరంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదిని పరామర్శించిన నిర్మల్ కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీహరి రావు
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 08
నిర్మల్ జిల్లా సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది గారి నానమ్మ వాజీద్బి ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచారి శ్రీహరి రావు స్వర్ణ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ—
“భగవంతుడు కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. శ్రీహరి రావుతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లోజు నరసయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, ఎంబడి రాకేష్, అతీక్ అహ్మద్, కొట్టె శేఖర్, గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.