ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరణ

ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరణ

ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరణ

ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ హైకోర్టు మాజీ ఏజీపీలు గౌతం కుమార్ (హోం శాఖ), వంశీకృష్ణ (రెవిన్యూ)

గౌరవ అతిథులుగా హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, ఎన్ హెచ్ ఆర్ సి కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి పాటిల్

విశిష్ట అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ కుమార్ గడిపే

రాష్ట్ర, జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరణ

సెక్రటేరియట్ (హైదరాబాద్): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున తెలంగాణ సెక్రటేరియట్ సమీపంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు మాజీ ఏజీపీలు ఎం గౌతమ్ కుమార్ (హోమ్ శాఖ), వంశీకృష్ణ (రెవిన్యూ), తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్, సోషల్ జస్టిస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ కుమార్ గడిపే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాదులు బోసు బాబు, తేజస్, ఇంద్రపల్లి వెంకటేష్ హాజరై నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం (జాతీయ మానవ హక్కుల కమిటీ)ఎన్ హెచ్ ఆర్ సి చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ద్వారా ఏదైనా సాధించవచ్చు అని అభిప్రాయపడ్డారు. సంస్థ బలోపేతంలో తాము కూడా భాగస్వాములమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మీదింటి శివవీర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు తోట రాజయ్య, పాముల నారాయణ, రాష్ట్ర కార్యదర్శులు రామిండ్ల తిరుపతి, బొమ్మిడాల మురళి, రాష్ట్ర కమిటీ సభ్యులు గౌని నాగేశ్వర్ రెడ్డి, ఎండి సమీ గోగులమూడి హరికృష్ణ, పాత శ్రీనివాస్ యాదవ్, గోరపూడి భాస్కరరావు, వి వి కే ప్రసాద్, రాచకొండ కనకయ్య, జిల్లా అధ్యక్షులు మర్రపు నాగార్జున రావు (మేడ్చల్ మల్కాజిగిరి), తమ్మల్ల ఆంజనేయులు (రంగారెడ్డి), సాయి ప్రసాద్ యాదవ్ (మెదక్), పల్లె రాజు (సిద్దిపేట), వి నగేష్ (హనుమకొండ), మల్లెపల్లి సువర్ణ రెడ్డి (నారాయణపేట), బి హరీష్ కుమార్ (మహబూబ్ నగర్), ఎండి హబీబ్ (వనపర్తి), సిహెచ్ వెంకట్ (కొమురం భీం ఆసిఫాబాద్), ఎంఏ వకీల్ (నిర్మల్), ఎం ధర్మేందర్ (నిజామాబాద్), విజయ్ కుమార్ (భద్రాది కొత్తగూడెం), అనిల్ రెడ్డి (సిరిసిల్ల రాజన్న) ఇమ్మడి ప్రణయ్ (కరీంనగర్), గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అస్మత్ ఉన్నిసా, శోభారాణి, రామ్మూర్తి, అర్జున్ సింగ్, ఈశ్వరరావు, బబ్బురి వెంకటేష్ యాదవ్, పలు జిల్లాల ప్రధాన కార్యదర్శిలు ఎస్వి సురేష్ రెడ్డి, సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి రవి గౌడ్, కాటం ప్రశాంత్ కుమార్, కోమండ్ల శ్రీనివాస్, దుర్గా పాండే, లావణ్య, సురవరం రాజేందర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment