మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్నాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం మండలంలోని విట్టోలి గ్రామంలో మహిళా సంఘ నూతన భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను కనబర్చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నూతన భవనం మహిళా సంఘ కార్యకలాపాలకు ఒక కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ సుచరిత దిగంబర్, ఉప సర్పంచ్ శివాజీ పటేల్, పంచాయతీ కార్యదర్శి అనూష, ఏపీఎం గురుచరణ్, ఈజీఎస్ ఏపీఓ శిరీష, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.











