బొథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 28
మండల కేంద్రంలోని వాసవి పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి గంగయ్య మాట్లాడుతూ, శ్రావణ పౌర్ణమి సందర్భంగా పాఠశాలలో ముందస్తుగా రక్షాబంధన్ ఉత్సవాన్ని నిర్వహించామని తెలిపారు.

ఈ కార్యక్రమ విశిష్టతను గురించి పాఠశాల విద్యార్థులకు వివరిస్తూ, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఈ రక్షాబంధన్ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సోదరి సోదరీమణులు వారి బంధానికి ప్రతీకగా రక్షలు కట్టుకోవడం, బలి రాజా దానవేంద్రో మహాబలః, తేన త్వామ్ అభివధ్నామి రక్షేమాం చల మాచల (నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం దేశానికి, ధర్మానికి రక్ష) అనే మంత్రంతో, యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు) అనే సూక్తితో సోదరీమణులకు రక్షక కవచంగా ఉంటామని, వారికి భరోసా ఇవ్వడం గొప్ప విషయమని తెలిపారు.
కేవలం కృష్ణ పరమాత్మకు వేలికి తగిలిన గాయానికి తన చీర కొంగుతో కట్టు కట్టి పరమాత్మ యొక్క రక్షను తీసుకున్న ద్రౌపది మాతను, అందుకు ప్రతిఫలంగా తన మాన ప్రాణాలను కాపాడి, ఎన్నో చీరలు ఇచ్చి రక్షించిన సంఘటనను గుర్తుచేస్తూ, ఇలా ఇంత గొప్ప పండుగ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.