విదేశీ విద్యను ఆశించే విద్యార్థులకు ట్రాన్స్‌పసిఫిక్ ఇండియా సంస్థ ఒక అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్మీడియట్ నుంచి మాస్టర్స్ స్థాయి వరకు వివిధ కోర్సులకు విదేశాల్లో చదువుకునేందుకు మార్గాలను ఈ సంస్థ సుగమం చేస్తోంది.
ట్రాన్స్‌పసిఫిక్ ఇండియా డైరెక్టర్ గోపిడి గంగారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, డిగ్రీ తర్వాత పీజీ, ఇంజినీరింగ్ తర్వాత మాస్టర్స్ వరకు అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. హెల్త్, బిజినెస్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఐటీ వంటి విభిన్న రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల యువత ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పూర్తి వివరాల కోసం 9397100200 నంబర్‌ను సంప్రదించవచ్చని, అలాగే ట్రాన్స్‌పసిఫిక్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ విద్యా అవకాశాలు సులభతరం అవుతాయని నిర్వాహకులు తెలిపారు.


