ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో యువ పర్యాటక క్లబ్లు, వారసత్వ విభాగానికి సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుల పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ ఆవిష్కరించారు.
అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థులు జిల్లా పర్యాటక ప్రదేశాల ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు విలువైన పుస్తకాలను అందజేశారు.











