నగరం, 2026-06-05
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్డులు కేవలం నిత్యావసర సరుకులు పొందడానికే కాకుండా, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు వంటి అనేక ప్రయోజనాలను పొందడానికి కీలక ఆధారంగా ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు తెలిపారు.
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం నిత్యావసర సరుకులు పొందడానికే కాకుండా, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు వంటి అనేక ప్రయోజనాలను పొందడానికి కీలక ఆధారంగా ఉపయోగపడతాయని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలు
స్వాతంత్ర్యం అనంతరం దేశం విద్య, వైద్యం, వ్యవసాయం, ఆహార భద్రత, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయని చిన్నారెడ్డి గారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి గారు సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో 2.77 లక్షల కార్డుల పంపిణీ
రాష్ట్రంలో సుమారు 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన కుటుంబాలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో 2,77,457 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేదని, ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అక్షరాస్యత గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం తెలంగాణలో అక్షరాస్యత 64 శాతానికి పైగా చేరుకోవడం రాష్ట్రంలో సాధించిన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
రేషన్ వ్యవస్థ ప్రాముఖ్యత
విద్య, వైద్యం, ఆహార భద్రతతో పాటు పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాయని తెలిపారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావడంలో రేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని, రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందించడం వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బియ్యంతో పాటు నూనె, పప్పు, కారం, ఉప్పు తదితర నిత్యావసర వస్తువులను కూడా రేషన్ దుకాణాల ద్వారా అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.












