హైదరాబాద్, 2026-08-18
తెలంగాణలో ప్రజా రవాణా సేవలను మరింత సులభతరం చేసే దిశగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సు టికెట్లను మీ సేవ యాప్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఆర్టీసీతో పాటు మెట్రో, ఆటో, క్యాబ్ సేవలను కూడా ఒకే చోట నుంచి పొందవచ్చు.
తెలంగాణలో త్వరలోనే ఆర్టీసీ టికెట్లను మీ సేవ యాప్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రజా రవాణా సేవలు అయిన ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్.. ఇక నుంచి అన్ని ఒకే యాప్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సౌకర్యాలు
దీని ద్వారా ప్రయాణికుడు ఒకేచోట నుంచి ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లో తన గమ్యస్థానానికి ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఛార్జీలను కూడా ఆన్ లైన్లో చెల్లించవచ్చు.












