తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 26న నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 16న పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మార్చి 26న నోటిఫికేషన్తో ప్రారంభమవుతుంది. నామినేషన్లను మార్చి 5 లోపు దాఖలు చేయాలి. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది.
మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, ఏప్రిల్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. తెలంగాణ నుండి డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి ల పదవీకాలం ముగియనుంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీ నాటికి ముగియనుంది. వీరిలో మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఏప్రిల్ 2న 22 మంది, ఏప్రిల్ 9న 15 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలోని రెండు స్థానాలను గెలుచుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నాయి.

