కొమురవెల్లి/గజ్వేల్/ శంషాబాద్ రూరల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడింటిని తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కల్పించే ఈ రైళ్లు రాష్ట్రంలో గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తూ, ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏడు బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతుంటే అందులో మూడింటిని తెలంగాణకే కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయని, హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు రెండు గంటల్లోనే చేరుకోవచ్చన్నారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని, రాష్ట్రంలో ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సమీపంలో రూ.6 కోట్లతో నిర్మించిన రైల్వే స్టేషన్ ను ఆదివారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో, తర్వాత గజ్వేల్‌లో విలేకరులతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.40 కోట్లతో కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కేవలం రూ.20 ఖర్చుతో కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునే అవకాశం తీసుకొచ్చామని, అంతేకాకుండా రూ.100 ఖర్చుతో నెలవారీ పాసు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి రూ.500 కోట్లతో ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాశానని గుర్తుచేశారు. అమృత్ భారత్ పథకంలో సుమారు రూ.800 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల మాదిరిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కాజీపేటలో అత్యాధునిక రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు.
బండి సంజయ్ ఈ సభలోను, అనంతరం ఢిల్లీ వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలో జెన్ జీలకు మంత్రి పదవులు ఇవ్వాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని వ్యాఖ్యానించారు. వృద్ధులకు పదవులు కట్టబెట్టడం దృష్టిలో జెన్ జీలంటే వీహనుమంతరావు, కే కేశవరావు, కోదండ రెడ్డి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 'బీజేపీకి దేశం ఫస్ట్. పార్టీ నెక్స్ట్. వ్యక్తి లాస్ట్' అని చెప్పారు. కేంద్రంతో ఘర్షణ ప్రభుత్వం అయితే అభివృద్ధి విషయంలో కేంద్రంతో మంచికాదని, ఏ రాష్ట్ర సహకరిస్తుందో వారికే కేంద్ర అభివృద్ధి ఫలాలు అందుతాయని తన అభిప్రాయమన్నారు. అందుకే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు.











