హైదరాబాద్, జులై 28
తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల డేటా ఆధారంగా ఈ రిజిస్టర్ రూపొందించబడుతుంది. ప్రజలకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయడంతో పాటు, మీసేవ కేంద్రాల ద్వారా వీటిని అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల డేటా ఆధారంగా దీన్ని తయారు చేయనుంది. ప్రజలకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీసేవ ద్వారా వీటిని ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సమాజంలోని ప్రతీ కుటుంబానికి సంబంధించిన అధికారిక వివరాలను ఒకే చోట పొందుపరిచేలా, ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్' జారీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.











