మిర్యాలగూడలోని ఎస్.వి మోడల్ హై స్కూల్లో యూకేజీ, 5వ తరగతి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్, డైరెక్టర్ శ్రీమతి విశాలక్ష్మీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ విద్యా దశలను పూర్తి చేసుకుని తదుపరి స్థాయిలకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి వేదికపై సర్టిఫికెట్లు అందుకున్నారు. వారి సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమానికి సుమారు 500 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆహ్వానితులు హాజరయ్యారు.
కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, విలువలను పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








