తొండకూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 08
డొంకేశ్వర్ మండలం తొండకూర్ లోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిపినట్లు తెలిపారు.
డొంకేశ్వర్ మండలం తొండకూర్ లోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిపినట్లు తెలిపారు.
విద్యార్థుల ప్రత్యేక ఆకర్షణ
ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు తెలంగాణ సంప్రదాయ దుస్తుల్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాలు ఎత్తుకొని, పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ నరేష్, ఇంచార్జ్ స్వామి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.