భీమారం మండలం అరెపల్లీ గ్రామంలో ప్రత్యేక గ్రామసభను సర్పంచ్ ఆకుదారి వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో 18 ఏళ్ల నిండిన కొత్త ఓటర్ల పేర్లను చేర్పించడం, మృతుల పేర్లను తొలగించడం వంటి అంశాలు చర్చించబడ్డాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మొక్కలు నాటాలని, మరియు ఇంట్లో నాలుగు రకాల చెత్త డబ్బాలను ఉపయోగించాలని సూచించారు.
సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం మరియు నీటిని సంరక్షించడంలో గుంతలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను కూడా చర్చించారు. చుట్టుపక్కల చెత్తను కాల్చిన వారిపై ఫైన్ విధించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నకిలీ విత్తనాల వినియోగం నివారించాలనే ఉద్దేశంతో సబ్సిడీ ద్వారా విత్తనాలను బుక్ చేసుకోవాలని సూచించారు. గ్రామంలో డ్రగ్స్ ను నిషేధించాలనే అంశం కూడా ప్రస్తావించబడింది.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ది అధికారి మధుసూదన్, ఎంపీవో సతీష్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











