దామరచర్లకు చెందిన జర్నలిస్ట్ నకిరేకంటి గోపి, విజయల కుమార్తె శివాని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి, 470కి 467 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ప్రస్తుతం నల్గొండలోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శివాని, పదో తరగతి వరకు దామరచర్ల లోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యనభ్యసించారు. గత పది పరీక్షలలో కూడా ఆమె 550 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు.
ఇంటర్మీడియట్ లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన శివానిని కళాశాల యాజమాన్యం అభినందించింది. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించింది.
జర్నలిస్టుల సంఘాలు కూడా శివానిని అభినందిస్తూ, ఆమె విద్యా ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాయి.
తల్లిదండ్రులు గోపి, విజయ తమ కుమార్తె సాధించిన ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.












