హైదరాబాద్, 2026-08-25
ప్రముఖ రైతు నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి రైతు ఉద్యమానికి, కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.
ప్రముఖ రైతు నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి రైతు ఉద్యమానికి, కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షునిగా, కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన మల్లారెడ్డి, వరంగల్ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
పార్టీ పునర్నిర్మాణంలో కృషి
వరంగల్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలో విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొని, యువతను సమీకరించి పార్టీ పునర్నిర్మాణంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. సాధారణ రైతాంగ సమస్యలతో పాటు సహకార, నీటిపారుదల రంగాలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేది. రైతాంగ సంక్షోభం, దాని లోతుపాతులపై ఆయన అపారమైన అధ్యయనం చేశారు. ప్రజాశక్తి పత్రికకు ఆయన అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు.
లోతైన అధ్యయనం, అనుభవాల సమీకరణ
సమస్యలను లోతుగా అధ్యయనం చేసే మల్లారెడ్డి, ఆయా అంశాలపై జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను తెలుసుకునేవారు. కొరటాల సత్యనారాయణ వంటి అనుభవజ్ఞులైన రైతు నాయకులతో నిరంతరం చర్చించి సలహాలు తీసుకునేవారు. వయసులో చిన్నవారైనా, అనుభవజ్ఞులైన వారి నుంచి విషయాలను తెలుసుకునేందుకు ఏనాడూ వెనుకాడేవారు కాదు. వ్యవసాయ సంక్షోభంపై రాష్ట్ర, జాతీయ స్థాయి సెమినార్లలో పాల్గొని ప్రసంగించారు. శ్రోతగా వెళ్లిన సందర్భాల్లోనూ ప్రతినిధులను ఆలోచింపజేసేలా ప్రశ్నలు సంధించేవారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్. స్వామినాథన్‌తో పలుమార్లు సంభాషించారు. ప్రొఫెసర్ జయతి ఘోష్ కమిషన్ చర్చలు, సంప్రదింపుల్లో మల్లారెడ్డి పాత్ర గణనీయమైనది. అనుభవపూర్వక అంశాలను వారికి వివరించేవారు. ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ కూడా మల్లారెడ్డితో సంభాషించేవారు.
రెవెన్యూ, సహకార, పంచాయతీరాజ్ పరిపాలనపై పట్టు
సహకార రంగంలో మల్లారెడ్డికి విశేష అనుభవం ఉంది. తన స్వగ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని సమర్థవంతంగా, లాభసాటిగా నిర్వహించారు. వరంగల్ డిసిసిబి నిర్వహణలోనూ ఆయన పాత్ర ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన పటేల్ (గ్రామాధికారి) బాధ్యతలను నిర్వహించడంతో పాటు గ్రామ పంచాయతీ అనుభవం కూడా ఆయనకు ఉంది. ఈ పునాదితోనే, ప్రభుత్వం సంస్కరణల పేరుతో తెచ్చిన మార్పుల వల్ల రైతాంగానికి జరిగే నష్టాన్ని ఆయన వివరించేవారు. విధానపరంగా అవి ఎలా తప్పో విడమర్చి చెప్పేవారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, డెయిరీలను మూసివేయడం లేదా ప్రైవేట్ పరం చేసిన సందర్భాల్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేవారు.
రైతు సమస్యల పరిష్కారానికి పోరాటం












