బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
మండల కేంద్రంలోని స్థానిక సెయింట్ థామస్ స్కూల్ నందు 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆరంభం నుండి సేవలు అందిస్తున్న అటెండర్ నాగభూషణం, సీనియర్ ఉపాధ్యాయురాలు పన్నాల విజయ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రత్యేకత
సంస్థ ప్రారంభం నుండి భాగస్వాములైన వారి చేతుల మీదుగా జెండా వందనం జరగడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు ఆకట్టుకున్నాయి.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ దీపక్, ప్రిన్సిపాల్ సిస్టర్ స్మిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.