సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు : 👉 విద్యార్థులకు బహుమతులు అందజేసిన శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ ఆగస్టు 15 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం- చైతన్య నగర్ లో గల సెయింట్ జాన్స్ హై స్కూల్లో శనివారం భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను పాఠశాల చైర్మన్ అలుగు బెల్లి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించి,జాతీయ గీతాన్ని ఆలపించారు. కరస్పాండెంట్ అలుగు బెల్లి శిరీష ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ సమైక్యతా భావాన్నిపెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, వినోదాత్మక ఆటలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అలుగు బెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిశాయి.












