సాయినగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
సాయినగర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సాయినగర్ వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మణచందా మండలం బోరిగం గ్రామానికి చెందిన వినోద్ (26), నరసింహ (46)లకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితులను 108 పైలట్ మహేష్, ఈఎంటీ ప్రభాకర్ సహాయంతో 108 అంబులెన్స్‌లో స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.












