పట్టణంలోని ప్రియదర్శిని నగర్ లోని సాయి భక్తుడు గొండ శంకర్ నివాసంలో శనివారం సాయంత్రం సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుని ఆశీర్వచనాలు కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండేలా చిత్రపటాన్ని అందజేశారు.
సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి శనివారం భక్తుల ఇళ్లల్లో కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
భక్తితో కూడిన కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి దోహదపడతాయని, మానసిక ప్రశాంతతను అందిస్తాయని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పండరి, రాజు, శ్రీనివాస్ వర్మ, రామరాజు, జిందం గోవర్ధన్, కోల శంకర్, రాజేష్, ప్రకాశ్ గౌడ్, సత్యం, కైలాసపతి, తిరుపతి, రేఖ, మాధవి తదితరులు పాల్గొన్నారు.












