కరీంనగర్, జూన్ 30
కరీంనగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చౌక్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాజకీయ కక్షతో భద్రత తగ్గిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ చౌక్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కొంకటి శేఖర్ మాట్లాడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను రాజకీయంగా ఎదుర్కొనే బదులు ఆయన భద్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులపై కక్షపూరిత చర్యలు తగవని అన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగ జీవితంలో ఎన్నో సంవత్సరాలు దేశ సేవకు అంకితం చేశారని, అనంతరం గురుకుల వ్యవస్థలో పేద విద్యార్థుల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.
ఆయనకు భద్రత తగ్గించడం రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మేకల రవీందర్, దుస్స కుమారస్వామి, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి మొలుమ్మూరి చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా ఇన్చార్జి మైస శ్రీధర్, న్యాయవాది బొంకూరి మోహన్, నిరంజన్, మహిళా నాయకురాలు నలువాల జమున, వంశీ, అక్షయ్, అసంపల్లి రాకేష్, కల్లేపల్లి తిరుపతి, మహమ్మద్ షమీ, రిషి తదితరులు పాల్గొన్నారు.












