రాజన్న సిరిసిల్ల, 2026-08-07
చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

నేతన్న విగ్రహానికి నివాళులు
శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహానికి, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు.
ఉపాధి కల్పనలో ప్రభుత్వం పాత్ర
సిరిసిల్లలోని నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులకు సంవత్సరంలో సుమారు ఎనిమిది నెలల పాటు పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ఏడాది 6 కోట్ల 70 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఈ ఏడాది ఇప్పటికే 4 కోట్ల 50 లక్షల మీటర్ల చీరల తయారీకి అవకాశం కల్పించామని తెలిపారు. త్వరలో మరో కోటి 50 లక్షల మీటర్లకు పైగా ఆర్డర్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇతర పథకాలతో చేయూత
ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంలు, ఇతర అవసరాలకు సంబంధించిన వస్త్రాల తయారీ ద్వారా కూడా స్థానిక నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. త్రిఫ్ట్ పథకం ద్వారా నేతన్నల పొదుపునకు ప్రభుత్వం సమానంగా చేయూతనిస్తోందని, నేతన్నల బీమా పథకం కింద సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 129 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.