పెద్దపల్లి, 2026-08-19
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐదుగురు మంత్రులు బుధవారం పర్యటించనున్నారు. సుల్తానాబాద్, మంథని వద్ద బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐదుగురు మంత్రులు బుధవారం పర్యటించనున్నారు. సుల్తానాబాద్, మంథని వద్ద బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రెండు నియోజకవర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. మంథని నియోజకవర్గంలో రూ.164.64 కోట్లు, పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.222.68 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మంత్రుల భాగస్వామ్యం
ఈ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్చార్జీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.
భారీ బందోబస్తు
మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చాయి.












