లక్ష్మణచాంద రూరల్, 2026-06-05
జగం-షణంఅభృధ,ణూ.10అంంూీధంజూోజగంగఇజశీష,భశంంంం.
నిర్మల్ నియోజకవర్గంలోని వడ్యాల్ - లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
కనకాపూర్ నుండి కామల్ కోట్ సమీపంలోని గోదావరి వంతెన మీదుగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లే ఈ రహదారిలో వడ్యాల్, లక్ష్మణ్ చందా గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ రహదారి అభివృద్ధికి మొత్తం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. ఈ ప్రతిపాదనలలో మూడు కీలక పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ పనులకు నిధులు మంజూరు చేయాలని శ్రీహరి రావు విజ్ఞప్తి చేశారు.












