నిర్మల్, 2026-06-05
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సుమారు 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యార్థులను కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల డబ్బులను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సుమారు 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ, ఫీజుల బకాయి బిజెపి లడాయి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లోని విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థుల సమస్యలపై ఆరా
ఈ సందర్భంగా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సూరజ్ నాయక్, సాత్విక్, బీజేవైఎం నాయకులు కందుల హరీష్, వెంకటేష్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.











