నూతనంగా నిర్మల్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నర్సాపూర్ గ్రామ సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముధోల్ మాజీ శాసనసభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇంద్రకరణ్ రెడ్డి సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
ఈ కార్యక్రమంలో సర్పంచులు ముత్త గౌడ్, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్వర్, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపిడి గంగారెడ్డి తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.












