నిర్మల్, 2026-07-20
నిర్మల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధ్యక్షునిగా దొడ్డికింది నిరంజన్ రెడ్డిని రాష్ట్ర నాయకత్వం నియమించింది. దిలావర్ పూర్ మండలానికి చెందిన నిరంజన్ రెడ్డి నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
నిర్మల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధ్యక్షునిగా దొడ్డికింది నిరంజన్ రెడ్డిని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దిలావర్ పూర్ మండలానికి చెందిన నిరంజన్ రెడ్డిని భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షునిగా నియమించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు గణేష్ కుండే జిల్లా అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. అందులో నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా నిరంజన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షునిగా నిరంజన్ రెడ్డి నియమితులైన సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నాయకులు ఆయనకు సాలువాలు కప్పి, పూల గుచ్ఛాలతో అభినందించారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.












