నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్లో నివేదిత మరియు కృష్ణ ప్రసాద్ రావుల వివాహ మహోత్సవం బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
లక్కంపల్లి గ్రామానికి చెందిన హన్మంతొల్ల అపర్ణ సంజీవ్ రావు కుమార్తె నివేదిత, పెంచకల్పాడ్కు చెందిన కృష్ణ ప్రసాద్ రావుల వివాహం నిజామాబాద్లో జరిగింది.
వివాహ మహోత్సవానికి నిజామాబాద్ మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వధువు తరపున మెటపల్లి సర్పంచ్ బి. పద్మ విజయరావు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


