ముధోల్ మండల కేంద్రంలోని స్మశాన వాటిక భూమిని అక్రమ కబ్జాల నుంచి కాపాడాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాల నాయకులు కోరుతూ తహసీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.
సర్వే నంబర్ 656లో గల 1.16 గుంటల స్మశాన వాటిక స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సంఘ నాయకులు ఆరోపించారు. వెంటనే భూమిని సర్వే చేసి రక్షించాలని వారు అధికారులను కోరారు.
తప్పుడు పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
స్మశాన వాటిక భూముల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే సర్వే నిర్వహించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు సంఘ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.











