Alluri Sitharama Raju/Araku Valley (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 28
0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో, దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో, గాంధీనగర్తో పాటు దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో వ్యాధి నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమైందని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జానకి రాములు, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, గుడిపాటి నవీన్, కౌన్సిలర్ సోముసుందర్, ఉబ్బే పల్లి మధు, రామకృష్ణ (ఆర్కే), ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.












