మిర్యాలగూడ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు సూచనల మేరకు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి నేతృత్వంలో పూలే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పూలే సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధి కోసం చేసిన కృషిని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి (రాంబో), బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్, కౌన్సిలర్లు పెద్ది శ్రీనివాస్ గౌడ్, దినేష్, జానకమ్మ, గుడిసె దుర్గ ప్రసాద్ హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.












