మిర్యాలగూడ నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ లో గల టిఎన్ఆర్ గార్డెన్స్ లో ఈ నెల 17వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.
ఈ సమావేశంలో సర్, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, డిజిటల్ సభ్యత్వాల నమోదు ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మిర్యాలగూడ డిజిటల్ సభ్యత్వాల నమోదు ఇంచార్జ్ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎం.సి. కోటి రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలోని అన్ని మండల, పట్టణ, గ్రామాల ముఖ్య నాయకులు, బి.ఎల్.ఏ.లు, సభ్యత్వ నమోదు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భాస్కర్ రావు కోరారు.












