మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
కొన్ని మీడియా సంస్థల పనితీరు వ్యభిచారంతో సమానంగా ఉందని, వాటి కారణంగా సమాజం, ముఖ్యంగా యువత నాశనమైపోతోందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. తెలియకుండానే సుమారు 4 దశాబ్దాల భవిష్యత్ సర్వనాశనం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి చెడు అలవాట్లు లేనివారు సైతం ఆ మీడియా వార్తలను అనుసరిస్తే దరిద్రాన్ని, ఒకరకమైన కృత్రిమ మానసిక రోగాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆయన హెచ్చరించారు.
కొన్ని మీడియా సంస్థల పనితీరు వ్యభిచారంతో సమానంగా ఉందని, వాటి కారణంగా సమాజం, ముఖ్యంగా యువత నాశనమైపోతోందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. తెలియకుండానే సుమారు 4 దశాబ్దాల భవిష్యత్ సర్వనాశనం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి చెడు అలవాట్లు లేనివారు సైతం ఆ మీడియా వార్తలను అనుసరిస్తే దరిద్రాన్ని, ఒకరకమైన కృత్రిమ మానసిక రోగాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆయన హెచ్చరించారు.
మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, వైద్యం, మానవహక్కుల భద్రత, మెరుగైన పౌర సేవలు, పరిశుభ్రమైన త్రాగునీరు వంటి అంశాల కన్నా, అరకొర వస్త్రధారణతో ఉన్న స్త్రీలకే ప్రచార మీడియా కథనాలు ఎక్కువగా కేటాయిస్తోందని, సామాజిక అంశాలను మరుగున పెడుతోందని మేడా శ్రీనివాస్ విమర్శించారు. ఒకప్పుడు పూర్తి వస్త్రధారణతో ఉన్న స్త్రీని ఆదర్శ మహిళగా గుర్తించేవారని, నేడు కొన్ని మీడియా సంస్థలు అర్ధనగ్న స్త్రీల చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ యువతీ యువకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రతి కుటుంబ క్షోభకు కారకులవుతున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం శాసిస్తున్న కొన్ని మీడియా సంస్థల వల్లే విలువలు, సామాజిక భద్రత లేని సమాజాలు వెలుస్తున్నాయని, ఆ మీడియా వార్తలకు అలవాటు పడితే సొంత మేధస్సు మందగించి, మీడియా చూపిస్తున్న మార్గానికి బానిసలుగా మారతారని, యుక్తవయస్సు మొత్తం వృధా అయిపోతుందని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. నేరస్తులకు, అసాంఘిక శక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల మెదళ్లలోకి వార్తలను వ్యసనంగా చొప్పిస్తున్నారని, దీనివల్ల యువత చెడు హీరోయిజానికి ఆకర్షితులై, 40 ఏళ్లు దాటకుండానే మరణిస్తున్నారని లేదా జీవచ్ఛవాలుగా మారుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ మీడియా కారణంగా దొంగలకు, వ్యభిచారులకు లభిస్తున్న గుర్తింపు, గౌరవం సామాజిక స్పృహతో జీవిస్తున్న వారికి దక్కడం లేదని, నేడు అవార్డులు, రివార్డులు పొందుతున్న అత్యధికులు ఈ మీడియా సృష్టి నుండి పుట్టుకొచ్చినవారేనని, వారు కృత్రిమ గౌరవ మర్యాదల్లో బ్రతుకుతున్నారని మేడా శ్రీనివాస్ విమర్శించారు. కొన్ని మీడియా సంస్థల వార్తలు చదవడం, చూడటం గంజాయి వంటి మత్తుకు బానిసలుగా మారడమేనని, ఎలాంటి వ్యసనం లేకున్నా ఈ మీడియా వార్తలకు అలవాటు పడితే మానసిక వికలాంగుల వలే ప్రవర్తిస్తారని, దీనికి దూరంగా ఉన్న యువత ప్రయోజకులుగా ఉజ్వల భవిష్యత్తును అందుకుంటున్నారని ఆయన అన్నారు.
ఒక సంఘ విద్రోహ చర్య జరిగినప్పుడు, దానికి ప్రత్యేకంగా, పరోక్షంగా ఆ మీడియా సంస్థల ప్రభావమే అధికంగా ఉంటుందని, వారి వార్తల పనితీరు, నడిపిస్తున్న ఉన్మాదం, ఉగ్రవాదం మేధావులకు, శాస్త్రీయతకు సైతం అంతుపట్టనిదిగా, నిఘా వ్యవస్థలకు అసాధ్యంగా మెరిపిస్తుంటుందని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలు చూస్తుంటే జర్నలిజానికి, బ్రోకరిజానికి పెద్దగా తేడా కనపడటం లేదని, ఒక వార్త ప్రచురణ వ్యక్తి భవిష్యత్తుకో, సమాజ అభ్యున్నతికో, దేశ భద్రతకో ఉపయోగపడాలని, ఆ తరహా మీడియా వార్తల వల్ల ప్రజా అవసరాలకు, సామాజిక అంశాలకు ఎన్నడైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. ఇక నుండైనా సిగ్గు, ఎగ్గు లేని జర్నలిజాన్ని వదిలి మంచి కథనాలతో జర్నలిస్టుగా గర్వంగా బ్రతుకుదామని పిలుపునిచ్చారు.












