ప్రొద్దుటూరు, జూన్ 30
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాదంలో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు లేకపోవడంతో పోలీసుల అభ్యర్థన మేరకు ఈ సేవ చేశారు.
ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాదంలో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అయితే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసు సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబహాన్ను సంప్రదించారు.
వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ అధ్యక్షుడు సుబహాన్, అశోక్ కుమార్, సతీష్, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని సభ్యులు పేర్కొన్నారు.
శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 82972 53484, 9182244150.











