ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన, బంధువులు ఎవరూ లేని గోసుల శ్రీరాములు అనే వ్యక్తికి 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించారు.
స్థానికుల సమాచారం మేరకు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్ను సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి ఆదివారం హిందూ శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, అహమ్మద్ హుస్సేన్, దస్తగిరి, రసూల్ తదితరులు పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంత్య సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.











