లక్ష్మణ్ చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 03
లక్ష్మణ్ చందా మండలంలోని పొట్టపెల్లి గ్రామానికి చెందిన రైతు శనిగరపు అఖిల్ మరణించడంతో, ఆయన కుటుంబానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లక్ష్మణ్ చందా ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల భీమా చెక్కును అందజేశారు. ఈ మేరకు సహకార సంఘం చైర్మన్ శ్రీ ఎర్ర రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ సింగం వెంకట రాజులు చెక్కును రైతు కుటుంబానికి అందజేశారు.

సంఘం అండగా ఉంటుంది
రైతులకు సంఘం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రైతులందరూ తమ ఆధార్ వివరాలను సంఘంలో నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, సంఘ కార్యదర్శి సాయి ప్రసాద్, వజీర్ పాష, జీ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ చందా సర్పంచ్ రాజు, బోరిగం సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి, వడ్యాల్ సర్పంచ్ పసుపుల నరేష్, చామనపల్లి సర్పంచ్ సుదర్శన్, తిరుపెల్లి సర్పంచ్ రవి, మల్లాపూర్ సర్పంచ్ భీమేష్, వడ్యాల్ తండా సర్పంచ్ రాజేష్, సంఘ సిబ్బంది రమణ, నర్సయ్య, సతీష్, సాయి, రాజేశ్వర్ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.