కొమురంభీమ్ ఆసిఫాబాద్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనను నాన్-లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ దివాళాకోరుతనం అని, తాను ఈ నేలపై పుట్టి పెరిగిన ఆదివాసి బిడ్డనని ఆమె స్పష్టం చేశారు.
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు వ్యక్తిగత స్వార్థం, పదవుల కోసం వర్గ విభేదాలు సృష్టిస్తూ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆరోపించారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తనను నాన్-లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తాను ఈ నేలపై పుట్టి పెరిగిన ఆదివాసి బిడ్డనని, తనను నాన్-లోకల్‌గా చిత్రీకరించడం రాజకీయ దివాళాకోరుతనమని అన్నారు.
ఆదివాసి బిడ్డను అవమానించడమే
సిర్పూర్-యూ మండలం పుల్లార గ్రామంలో జన్మించి కొమురంభీమ్ గడ్డపై పెరిగానని, ఈ జిల్లా మట్టితో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. ఆదివాసి బిడ్డను నాన్-లోకల్ అనడం జిల్లా ప్రజలను, ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు.
కుట్ర రాజకీయాలపై విమర్శలు
మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి కొంతమంది కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి తనపై గాంధీభవన్‌లో ఆరోపణలు చేయించారని ఆమె ఆరోపించారు. ఇది పార్టీ బలోపేతం కోసం కాదని, కొందరు నాయకులు ఆడుతున్న రాజకీయ నాటకమని విమర్శించారు.
పార్టీ పట్ల నిబద్ధత
1995లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచానని, అప్పటి నుంచి పార్టీ మారకుండా పనిచేస్తున్నానని సుగుణక్క తెలిపారు. తన పనితీరు, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించిన అధిష్ఠానం టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా, డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిందన్నారు.
అసంతృప్తితో విమర్శలు
పదవులు దక్కలేదనే అసంతృప్తితో కొందరు నాయకులు పార్టీపై విమర్శలు చేస్తూ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని, అందరికీ సమాన గౌరవం కల్పించేలా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
క్రమశిక్షణ చర్యలపై హెచ్చరిక
పార్టీ క్రమశిక్షణను దెబ్బతీసే చర్యలను సహించబోనని హెచ్చరించిన ఆమె.. పార్టీని ధిక్కరించి అధిష్ఠానం నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న వారిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కార్యకర్తలకు పిలుపు












