కుంటాల, జూలై 17
కుంటాల మండలంలోని కల్లూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహసీల్దార్ కమల్ సింగ్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని నిల్వ గది, విద్యార్థినుల వసతి గదులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల సౌకర్యాలు, భోజనశాల పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
కుంటాల మండలంలోని కల్లూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహసీల్దార్ కమల్ సింగ్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని నిల్వ గది, విద్యార్థినుల వసతి గదులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల సౌకర్యాలు, భోజనశాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే విద్యార్థినులకు ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పట్టిక ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.











