✒️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి తన అభిప్రాయాలను, అభ్యంతరాలను ముఖ్యమంత్రి తెలియజేయనున్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి త్వరలో భేటీ కానున్నారు. పార్లమెంట్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇస్తున్న తనకు అన్యాయం జరగకుండా చూడాలని జగన్ అభ్యర్థించనున్నట్లు సమాచారం.
పునర్విభజన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాకుండా, తన అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని జగన్ కోరనున్నారని తెలుస్తోంది. పులివెందుల, పుంగనూరు వంటి నియోజకవర్గాలను ఎస్సీలుగా మారుస్తారనే నేపథ్యంలో, తాను బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ, కూటమికి అనుకూలంగా పునర్విభజన చేయడం అన్యాయమని జగన్ మోడీ, అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లనున్నారు.












