కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్దికి ప్రాధాన్యత నిస్తుంది.
-ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: కేంద్రప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.మండలంలోని నాగపూర్ గ్రామంలో రూ. 52 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఇందులో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం, 12 లక్షలతో అంగన్వాడీ భవనం, 20 లక్షలతో మహిళా సహకార సంఘం భవనం,వర్క్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంతో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలు, అగ్రికల్చరల్ గోదాం, సీసీ రోడ్లు డ్రైనేజ్ లు ఇలా అనేక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, మేడిసెమ్మ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, మండల అధ్యక్షులు కాల్వ నరేష్, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు, నాగాపూర్ గ్రామ సర్పంచ్ లలిత బాయి, నాయకులు సురేష్ నాయక్,డా.శివరామ్, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.












