తెలంగాణ ఉద్యమకారులు, నూడా మాజీ చైర్మన్ జి. ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జి. వైశాలిని రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం (సిల్వర్ జూబ్లీ) వేడుకలు నిజామాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై దంపతులను సన్మానించారు.
జిల్లా కేంద్రంలోని డి.ఆర్.ఆర్ పామౌజ్ బైపాస్ రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దంపతులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, నూడా చైర్మన్ కేశవ్ వేణు, రాష్ట్ర నాయకుడు డి. ఆర్. రామకిషన్ రావు కూడా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జి. ప్రభాకర్ రెడ్డి – వైశాలిని రెడ్డి దంపతులు చేసిన సేవలను అభినందించారు. వారిద్దరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని పలువురు ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం మరింత ఆనందంగా కొనసాగాలని కోరుకున్నారు.
ఈ వేడుకల్లో వెంకట్ రావు, రాజేశ్వర్ రావు, అరుణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ రాజేష్ బాబు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.








