(KTR) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
సరూర్నగర్లో జరిగిన BRS పార్టీ యువ సంగ్రామ సభలో, ఆ పార్టీ నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దీనిపై బైంసా టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సరూర్నగర్లో జరిగిన BRS పార్టీ యువ సంగ్రామ సభలో, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR) సమక్షంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పై BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బైంసా టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో నిర్మల్ జిల్లా అధ్యక్షులు సమరసింహారెడ్డి, ముదోల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ షాఫీ, యువజన్న కాంగ్రెస్ నాయకులు లవకూస్, విశాల్, సురేష్, సాయిప్రతాప్ నాయుడు, తాజద్దీన్ పాల్గొన్నారు. ఈ ఫిర్యాదు కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.












