బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బుధవారం సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) జరిగింది. పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడంతో పాటు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. అలాగే పాఠశాలకు మంజూరైన నిధుల వినియోగంపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, అందుతున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అనురాధ, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శోభ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.












