బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 17
బోథ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
బోథ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామాల్లోని నాగదేవత ఆలయాలు, నాగదేవత పుట్టల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. నాగదేవతకు పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శివాలయాల్లో భక్తుల రద్దీ
నాగుల పంచమి సందర్భంగా శివాలయాలు సైతం భక్తుల రాకతో కిటకిటలాడాయి. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని మహిళలు నాగదేవతను ప్రార్థించారు.
పండుగ సందడి
నాగుల పంచమి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరడంతో మండలంలోని పలు ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.












