బాసర, 2026-08-31
బాసర మండలంలోని పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం భూమిపూజ చేశారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు ఆయన హామీలు ఇచ్చారు.

దూడపూర్ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అలాగే గ్రామంలో బుద్ధ విహార్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కిర్గుల్-బి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి రూ.20 లక్షలు, వీవో భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు, డ్రైనేజీ పనులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బిడ్డూర్ రమేష్, దూడపూర్ సర్పంచ్ సతీష్ పటేల్, టాకీ సర్పంచ్ సిల్క్ విష్ణు, లబ్ధి సర్పంచ్ శంకర్, కిర్గుల్-బి సర్పంచ్ సరోజ రామ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ, ఉపసర్పంచ్ సాయిలు, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.