ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఆదివారం రాత్రి బైంసాలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.
నిర్మల్ పట్టణానికి చెందిన శ్రీహర్ష, బైపిసి ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 993 మార్కులతో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడంతో పాటు, జిల్లా, మండల, కళాశాల స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదల, కృషితో ఉన్నత స్థాయికి ఎదగాలని, తమ తల్లిదండ్రులకు, సమాజానికి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు.
చదువుతూనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, కష్టపడితే విజయం తప్పక వరిస్తుందని వారు విద్యార్థులకు సూచించారు.











