సర్వ శిక్ష అభియాన్ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ మాలోత్ బాలాజీ నాయక్, మండల విద్యాధికారులు దీరవత్ ధర్మానాయక్, వెంకన్న నాయక్, లక్ష్మణ్ నాయక్ లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన అంబేద్కర్ ఆశయాలను సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా అన్ని వర్గాల సంక్షేమాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన మహానేతగా అంబేద్కర్ ను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బాలు నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కొర్ర కృష్ణ కాంత్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, భాషా నాయక్, సేవియా నాయక్, వెంకట్రామ్ నాయక్, తావూరియా నాయక్ పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టులు ఖాజామీదుద్దీన్, ఎండి అస్లాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళి యాదవ్, నాగయ్య, సైదా నాయక్ తదితరులు కూడా నివాళులర్పించారు.












