ఆదిలాబాద్, 21 July
ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.జె.సంగీత తెలిపారు. వివిధ విభాగాల్లో పలు ఖాళీలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.జె.సంగీత తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ (2), ఇంగ్లీష్ (2), హెల్త్ కేర్(1), ఫిజిక్స్(1), జువాలజీ-(2), ఉర్దూ(1), బాటనీ(UM)(1), జువాలజీ(UM)(1), కెమిస్ట్రీ(UM) (1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అభ్యర్థులు జులై 24 వరకు దరఖాస్తు చేసుకొని, 28న డెమోకు హాజరుకావాలని సూచించారు.












