జూబ్లిహిల్స్‌లో గెలుపు నవీన్ యాదవ్‌దే!
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ప్రచారం – కాంగ్రెస్ వైపు జూబ్లీ ఓటర్లు
మనోరంజని తెలుగు టైమ్స్ ఖానాపూర్ ప్రతినిధి నవంబర్ 07
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా కదిలి ముమ్మర ప్రచారం చేపట్టాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జూబ్లిహిల్స్‌లో ప్రజా మద్దతు పెంచేందుకు చురుకుగా పాదయాత్రలు, ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. “రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారు. నవీన్ యాదవ్ విజయం ఖాయం” అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నమ్మకంగా తెలిపారు. ఆయన జూబ్లిహిల్స్ ప్రజలను ఆకట్టుకునే శైలిలో ప్రచారం చేస్తూ, గడప గడపకు తిరిగి, నవీన్ యాదవ్‌కు భారీ మెజారిటీతో గెలుపు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జైనూర్ ఎఎంసీ చైర్మన్ విశ్వనాథ్, ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ గోవింద్ నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బడుగు శ్యామ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల జూబ్లిహిల్స్ ఓటర్లలో అనుకూలత కనిపిస్తోందని నాయకులు తెలిపారు.